ముద్ర, భువనగిరి ప్రతినిధి : నిషేదిత భూములు, నిషిదిత జాబితాలో ఉన్న ఇండ్ల (నాల భూముల) గురించి వాట్సాప్ గ్రూపులలో తప్పుడు, దుష్ప్రచారం ప్రచారం చేస్తున్న వారిఫై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచో అమలులో ఉన్న రాష్ట ప్రభుత్వ నిబందల ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్-1908 సెక్షన్ 22-A కింద పబ్లిష్ చేయబడిన నిషేదిత భూముల జాబితా, నిషేదిత ఇండ్ల జాబితాలో ప్రభుత్వ భూములు, చెరువు శికం భూములు, దేవాదాయ శాఖా భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు, వివిధ ప్రభుత్వ అవసరాలకు సంబదించిన భూసేకరణ జరిగిన భూములు (రోడ్లు, రైల్వే, నీటి పారుదల ప్రాజెక్ట్ లు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇండ్ల స్తలాల కొరకు సేకరించిన భూములు, 2 BHK ఇండ్ల కొరకు సేకరించిన భూములు, స్వతత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు భూమి లేని నిరుపేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు వారికి ఇవ్వబడిన భూములు క్రయ విక్రయాలు జరుపుట చట్టం ప్రకారం నిషేధం కావున, వారి తదనంతరం వారి వారసులకి మాత్రమే చెందవలననే ఉద్దేశంతో ఇట్టి భూములు అమ్మడం కాని కొనడం కాని చెయ్యకూడదని వాటిని సెక్షన్ 22-A లో ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ కింద పెట్టడం జరిగిందన్నారు. ఈ భూములు గతం లోనే ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లో ఉన్నందున వాటిని కొనసాగించడం జరిగిందని దీనిపై కావాలని కొందరు దురుద్దేశ పుర్వకంగా ప్రజలలో అబద్రత భావం, బయ ఆందోళనకు గురి చేయు విధంగా ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ కొన్నివాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం వాటిని ప్రజలు నమ్మ వద్దన్నారు. ఇలా తప్పడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తిసుకోబడునన్నారు.