ముద్ర, తెలంగాణ బ్యూరో :
జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా “క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ ” అనే పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలో నిర్వహించే జన గణనలో అన్ని కులాల సామాజిక, విద్య,ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న భట్డి.., దేశవ్యాప్తంగా సమగ్ర కుల జన గణన చేపట్టడానికి అది మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేయడంలో, సామాజిక న్యాయాన్ని మరింత లోతుగా స్థాపించడంలో కుల లెక్కింపు ప్రాధాన్యతను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదిస్తుందని రచయితలు వారి అభిప్రాయాన్ని తెలిపారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం డిప్యూటీ సీఎం బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, మేధావులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతొ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో క్యాస్ట్ సెన్సెస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ పుస్తక రచయిత, ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిసర్చ్ స్కాలర్ జి కిరణ్ కుమార్, డాక్టర్ వాహిని బిల్లు పాల్గొన్నారు. డి అశోక్, సురేందర్, గణేష్, శివ, అరవింద్, లక్కీ, ప్రవీణ్, మల్లేష్ పాల్గొన్నారు.