Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష

 

93.64 శాతం హాజరు నమోదు
జిల్లా పాలీసెట్ కన్వీనర్ మదన్‌మోహన్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా పాలీసెట్ కన్వీనర్ మదన్‌మోహన్ తెలిపారు. జిల్లాకేంద్రంలో మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, బిజినపల్లి మండలం పాలెంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2912 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2727 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. దీంతో జిల్లాలో మొత్తం హాజరు శాతం 93.64గా నమోదైనట్లు పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ టీంలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సేవలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి జిల్లా పాలీసెట్ కన్వీనర్ మదన్‌మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ అబ్జర్వర్ మల్లయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.