Take a fresh look at your lifestyle.

రామాయంపేటలో ఎక్స్‌ప్రెస్ డిపో ఎమ్మెల్యే రోహిత్

 ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ ఆర్టీసి డిపోను మోడల్ గా మార్చడంతో పాటు రామాయంపేట డిపోను ఎక్స్‌ప్రెస్ డిపోగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం మెదక్ డిపోను పరిశీలించి ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, బస్సులు, డ్రైవర్ల కొరత, పాత బస్సుల స్థానంలో కొత్త, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడంపై చర్చించారు.
రామాయంపేట బస్ స్టాండ్‌లో మరుగుదొడ్ల పునర్నిర్మాణం కూడా చేపట్టనున్నామన్నారు. వెంట ఎం. గంగాధర్, డి. నరేశ్ గౌడ్, మన్‌సూర్, శివరామకృష్ణ, అవారి చంద్రశేఖర్, రాగి అశోక్, బొజ్జ పవన్, సిద్దిరాములు, మహ్మద్ సమీయుద్దీన్, బాలరాజ్ యాదవ్, సయ్యద్ ఉమర్ మొహియుద్దీన్, మైసన్ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ సత్తార్, శంకర్ గౌడ్, ఎం. బాలకృష్ణ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.