Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలు…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల పట్టణలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ, భవాని, శంకర, దేవాలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు


ఉదయం ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన, శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని, ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా వేదమంతో చాలా మద్యం ఆలయ అర్చకులు నిర్వహించారు
స్వామి అమ్మవార్ల కళ్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల కళ్యాణ అక్షంతలను అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బాశెట్టి లవకుమార్, ఈవో సంగెమ్ సురేందర్, ఆలయ అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, రుద్రంగి శశాంక్ మౌలి శర్మ, కొండపల్లి సూరజ్ శర్మ, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు, గౌరిశెట్టి గణేష్, గౌరిశెట్టి సాధన, రాగి వెంకటేశం, వొళ్ళాల సత్తయ్య, అను మల్ల ఉమాభారతి, బంగ్లా శేఖర్, భార్గవ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.