ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ధర్మా టీచర్స్ యూనిటీ క్యాలెండ్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ సత్యనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటియు కన్వీనర్ ఎర్ర సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన సిఫార్సులను సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు గౌరవప్రదమైన పాఠశాల విద్య కావాలని కోరుకుంటున్నారని పాఠశాలల్లో మౌలిక వసతులు లేని ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ విధానమైన చర్యలతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు విద్యా కమిషన్ ఆమోదయోగ్యమైన సిఫారసులు చేసిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించే విధంగా రూపొందించిన కమిషన్ సిఫార్సులను సవరించి తక్షణమే అమలు చేయాలని కాలయాపన చేస్తే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. పిఆర్సిని అమలు చేయాలని పెన్షనర్లకు పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎర్ర సుధాకర్, సభ్యులు డప్పు బిక్షమయ్య, పి.మహేష్, చింత యాదగిరి పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.