ముద్ర, మోత్కూర్:
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని బిజెపి మోత్కూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి జెండాను పట్టణ అధ్యక్షురాలు చాడా మంజుల రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా అమేమాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటితో 46 సం. రాలు పూర్తిచేసుకుని విజయవంతంగా 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. బిజెపి 1980 ఏప్రిల్ 6న అటల్ బీహార్ వాజ్ పాయ్ అధ్యక్షతన ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతంగా, అంత్యోదయ స్ఫూర్తిగా, దేశమే ప్రథమము అనే లక్ష్యం తోటి ఈ పార్టీ స్థాపించబడిందని, ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై నేడు దేశంలోని సుమారు 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని నేడు సుమారు 15 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని తెలిపారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తుందని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనే అభివృద్ధి మంత్రం తోటి దేశంలోని ప్రతి పల్లె, ప్రతి గడప అభివృద్ధి చెందే విధంసహకారంతోటి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ,పట్టణ నాయకులు సజ్జన మనోహర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అన్యపు సత్యనారాయణ, ఎడ్లరాము, రాధారపు మల్లేశం,గుంటి సతీష్, గొడుగు చంద్రమౌళి, మధు సోమేశ్వరి, వారాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.