Take a fresh look at your lifestyle.

“పహల్గామ్ మృతులకు నివాళులు”

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని పట్టణ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా రెండు నిమిషాల మౌనం పాటించి,నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మేరాజ్ మస్జిద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,అక్బర్ అలీ,యాకూబ్ అలీ మాట్లాడారు. రాజకీయ స్వలాభం కోసం మతాల పేరుని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయాలు చేస్తున్నారని వారు విమర్శించారు.అనంతరం మస్జిద్ నుంచి రాజీవ్ చౌక్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఆరీఫ్, సలీమ్, షరీఫ్, ఖాజా,ఇస్మాయిల్,అంకుష్,రియాజ్,షఫీ తదితరులు పాల్గొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పర్యాటకుల మీద జరిగిన దాడిని పట్టణ సిపిఐ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Leave A Reply

Your email address will not be published.