కరీంనగర్ జిల్లా తెలంగాణ ఎన్జీవో ఉద్యోగులందరూ విధిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి
సభ్యత్వం అంటే డబ్బులు కాదు… సంఘానికి పునాది రాళ్ల సమీకరణ – జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్:
తెలంగాణ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్, పశుసంవర్ధక మరియు జిల్లా ట్రెజరీ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది.
మెడికల్ అండ్ హెల్త్ శాఖ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యోగి నాయకులు గోవిందపతి శ్రీనివాస్, జీవన్ రెడ్డి, పాండు, ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధనలో తెలంగాణ ఎన్జీవో సంఘం ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు. సభ్యత్వం అంటే కేవలం డబ్బులు కాదు, అది సంఘానికి పునాది రాళ్లను సమీకరించడం, ప్రశ్నించే పోరాట యోధులను ఒకే వేదికపైకి తీసుకురావడం అని పేర్కొన్నారు.
మెడికల్ అండ్ హెల్త్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనంతో సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో వారు యుద్ధంలో సైనికుల్లా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు నోరులేని మూగజీవాలకు సేవ చేస్తూ సమాజానికి కీలక సేవలు అందిస్తున్నారని అన్నారు. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గిరిధర్ రావు, కమలాకర్, అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
జిల్లా ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, కొండయ్య, శశి, మహేందర్, రాధా లక్ష్మి పాల్గొన్నారు.
ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గార్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ నల్ల లింగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీఎన్జీవోల జిల్లా నాయకులు సంగ్యం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్ కుమార్, సర్దార్ అరవింద్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, రాజేశ్వరరావు, అలాగే ఉద్యోగులు రాజేష్, హైమావతి, హరిప్రియ, జగన్ గౌడ్, విజయలక్ష్మి, తోటరాజు తదితరులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.