Take a fresh look at your lifestyle.

మెదక్ జిల్లా… సెకండ్ ఇయర్ 26, ఫస్ట్ ఇయర్ 28వ స్థానం సత్తా చాటిన బాలికలు

ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ లో మెదక్ ఫస్ట్
సెకండ్ ఇయర్ లో 3వ స్థానం
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా ఆశించిన ఫలితాలు సాధించలేదు. సెకండ్ ఇయర్ లో 26వ స్థానం, ఫస్ట్ ఇయర్ లో 28వ స్థానంలో నిలిచింది జిల్లా. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో సైతం ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ఉంది. జిల్లాలోని 3 గురుకుల కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
జిల్లాలో సెకండ్ ఇయర్‌లో మొత్తం 4826 మంది పరీక్షలు రాయగా 3310 మంది 68.59 శాతం పాస్ అయ్యారు. బాలురు 1983 పరీక్షలు రాయగా 1168 మంది 58.90 శాతం పాసయ్యారు. బాలికలు 2843 మంది హాజరు కాగా 2142 మంది 75.34 శాతం పాసయ్యారు.

ఎంపీసీ -1 ఎన్. శృతిక
467/470
State 2nd Rank

ఫస్ట్ ఇయర్ లో సైతం బాలుర ఉత్తీర్ణత 46.99 శాతం మాత్రమే ఉండగా, బాలికలు 61.54 శాతంతో అదరగొట్టారు. మొత్తం 3,250 మంది బాలికలు పరీక్ష రాయగా 2,000 మంది పాసయ్యారు. బాలురు 2460 మందిలో కేవలం 1,256 మంది మాత్రమే పాసయ్యారు.
ఒకేషనల్ లో స్టేట్ లో జిల్లా ఫస్ట్
ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 599 మంది పరీక్షలకు హాజరుకాగా 440 మంది (73.46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 289 మంది పరీక్షలు రాయగా 171 మంది (59.17%) పాసయ్యారు. బాలికలు 310 మంది పరీక్షలు రాయగా 260 (86.77) పాసయ్యారు.

సెకండ్ ఇయర్ లో మెదక్ జిల్లా స్టేట్ లో 3వ స్థానంలో నిలిచింది. 539 మంది పరీక్షలకు ఫాజరుకాగా 460 మంది (85.34%) ఉత్తీర్ణత ఇందులో బాలురు 250 పరీక్షలు రాయగా 192 మంది (76.80%) పాసయ్యారు. బాలికలు 289 మంది పరీక్షలు రాయగా 268 మంది (92.73%) పాసయ్యారు.
కేజీబీవీ బైపీసీ విద్యార్థికి 975 మార్కులు
మెదక్ కేజీబీవీలో బిపీసీలో జి. శ్రీలత 975 మార్కులు సాధించింది. బీపీసీ సెకండ్ ఇయర్ లో
37 మంది పరీక్షలు రాయగా
26 మంది పాస్ అయ్యారు.11 మంది ఫెయిలయ్యారు. బీపీసీ మొదటి సంవత్సరంలో 32 పరీక్షలు రాయగా 17 మంది పాస్ అయ్యారు. 15 మంది ఫెయిల్ అయ్యారు. ఎంపీసీ సెకండ్ ఇయర్ లో 10 పరీక్షలు రాయగా 8 మంది పాస్ అయ్యారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో 30 పరీక్షలు రాయగా 19 మంది పాస్ అయ్యారు. 11 మంది ఫెయిల్ అయ్యారని ఎస్ఒ కవిత తెలిపారు.
మెదక్ మైనారిటీ విద్యార్థుల ప్రభంజనం

ఎంపీసీ సెకండ్ ఇయర్ అక్షయ
990/1000
మైనారిటీ కళాశాల మెదక్

ఇంటర్ ఫలితాలలో మెదక్ మైనారిటీ బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ర్యాంకులను సైతం కైవసం చేసుకున్నారు. బైపీసీ-1 లో హారిక 438/440 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎంపీసీ -1లో శృతిక, అఫ్షా బేగం ఇద్దరూ 467/470 సాధించి స్టేట్ రెండవ ర్యాంకు, బైపీసీ -1 లో శ్రావణి 436/440 సాధించి స్టేట్ మూడవ ర్యాంకును కైవసం చేసుకుంది.

జి.శ్రీలత 975/1000 బీపీసీ, కేజీబీవీ మెదక్

సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఎంపీసీ నుండి అక్షయ 990/1000 సాధించి మొదటి స్థానం, బైపిసి -2 నుండి కావ్యశ్రీ 991/1000 సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ- 1 నుండి 400కు పైగా 12 మంది విద్యార్థులు, బైపీసీ -1 నుండి 14 మంది విద్యార్థినిలు 400 పైగా మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఓవరాల్ గా కళాశాల ఉత్తీర్ణత 95%గా సాధించారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపల్ ఆర్. సురేఖ, కళాశాల సిబ్బంది అభినందించారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన చాకలి సాయిరాం అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

Leave A Reply

Your email address will not be published.