వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు.శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించారు. రోశయ్య మాజీ ముఖ్య మంత్రి గారి చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థ లు) పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో యువజన క్రీడల అధికారి మహమ్మద్ సత్తార్, విద్యా శాఖ అధికారి రేణుకదేవి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
