Take a fresh look at your lifestyle.

పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి

  • జిల్లా విద్యాధికారి కే.రాము.

కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల కల్లూరు రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము శనివారం రోజు సందర్శించారు. ఈ సందర్భంగా బోధనలో పిల్లలకు మెలకువలు నేర్పి, పాఠశాలలో ప్రవేశాలు పెంచాలని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. పాఠశాల సమయ పాలన పాటించి, సమయాన్ని బోధనకు సద్వినియోగం చేయాలని, వృత్తిని అంకిత భావంతో పనిచేయాలని, విద్యార్థులకు ఒక స్నేహితునిగా, మార్గదర్శిగా, ఆదర్శంగా ఉండాలని, వెనుక బడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మాతృ, దేశ భక్తి పెంపొందించాలని, పేరెంట్ టీచర్స్ సమావేశంలో విద్యార్థుల ప్రగతి పై, పాఠశాల అభివృద్ధి పై చర్చించాలని కోరారు. సమాజ భాగస్వామ్యంతో జగిత్యాల జిల్లాని అన్ని విధాల ముందు ఉంచాలని ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశమ్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు, రిసోర్స్ పర్సన్లు అందె శివప్రసాద్, మాసం చిరంజీవి, కోసరి శేఖర్, గంగుల రణధీర్, అన్నం మహేష్, సిరిపురం శ్రీనివాస్, సిరిపురం రాజేష్, అంకం దామోదర్, సీఆర్పీలు గంగాధర్, సత్యనారాయణ, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.