ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: జీడికే 11వ గనిలో శుక్రవారం ఉదయం 9 గంటల షిఫ్ట్ లో విధులకు హాజరై బావిలో దిగిన జి.శ్రీకాంత్ అను బదిలీ వర్కర్ కు రూప్ ఫాల్ అయి మెడపై గాయమైంది.వెంటనే హుటాహుటిన సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్ళి పోశం. వైస్ ప్రెసిడెంట్ మాదన మహేష్. ఫిట్ కార్యదర్శి శంకర్,సాయన్న, సంతోష్ చేరుకున్నారు గాయపడ్డ శ్రీకాంత్ కు మెరుగైన వైద్యం అందేలా చూసుకుంటున్నారు.
