Take a fresh look at your lifestyle.

“ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” సామాజిక బాధ్యత కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.లక్ష్మణ చాంద మండలం పొట్టపల్లి (కె) లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతిరోజు బాధ్యతగా ప్రజలంతా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
గ్రామస్తులతో మాట్లాడుతూ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. మహిళలు మహిళా సంఘాల్లో చేరి రుణాల వల్ల ఆర్థికంగా ఎదగాలన్నారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా, గ్రామస్తులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణను ఇప్పించి, మార్కెటింగ్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామని అన్నారు. ఆ తర్వాత నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, రోజు పాఠశాలకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, జడ్పి సిఈఓ శంకర్, ఆర్ డబ్ల్యు ఎస్ ఈఈ సందీప్, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథోడ్, గ్రామ సర్పంచ్ ముఖేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఇతర అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.