కోరుట్ల, ముద్ర: దేశ మాజీ ఉప ప్రదాని, సమత వాది డా. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడి వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన మహానేత పెరిట కోరుట్లలో నిర్మించనున్న మిని పంక్షన్ హాల్ కు ఐదు లక్షల నిధులను ప్రకటించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావుకు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం కోరుట్లలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన జయంతి ఉత్సవాలలో జగ్జీవన్ రామ్ విగ్రహనికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా విస్తరించి కార్మిక రంగంలో అనేక సంస్కరణలకు అద్యుడుగా నిలిచి ఎనలేని సేవలు చేసిన మహానీయుడి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన పెరిట నిర్మించనున్న ఫంక్షన్ హాల్కు ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు.దేశ అత్యున్నత భారత రత్న అవార్డు ఇచ్చి బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించలాని పేట భాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకై అందరం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల రాష్ట్ర ఉపాద్యక్షులు రుద్ర శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణు, కాంగ్రెస్, బిజెపి పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బింగి వెంకటేష్ మాజీ కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, బలిజ రాజరెడ్డి, ఎంబెరి నాగభూషణం, అడేపు మధు, పుప్పాల ప్రభాకర్, సంగ లింగం, దళిత సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య, చెట్పల్లి లక్ష్మణ్, బెక్కెం అశోక్, మాదిగ కుల సంఘ నాయకులు శనిగారపు రాజేష్, ఎస్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.