- బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన జువ్వాడి నర్సింగరావు.
కోరుట్ల, ముద్ర: బాబు జగ్జీవన్ రావ్ 117వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని చంద్వా గ్రామంలో జన్మించారు.భారతదేశ నాలుగవ ఉప ప్రధానిగా పని చేశారు. సామాజిక అసమాన తలకు ఎదురు చెప్పుతూ అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని కొని యాడారు. విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో మంత్రిగా ఉండి కీలకంగా సేవలందించిన జగ్జీవన్‌రామ్ భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు.తన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలిని అన్నారు. మహానీయులను స్మరిస్తూ మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమర యోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అంటరాని వారికి సమానత్వం కోసం, అంకితమైన ఆల్ ఇండియా డిప్రెషనల్ క్లాసెస్ అనే సంస్థను స్థాపించి కీలకపాత్ర పోషించారు. దేశ హరిత విప్లవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారు. భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రాల ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చేట్పల్లి లక్ష్మణ్, బలిజ రాజిరెడ్డి, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఉయ్యాల శోభన్, బెక్కెం అశోక్, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
