ముద్ర, తెలంగాణ బ్యూరో : అఫ్జల్ గంజ్ కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన దుండగులు తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్ పేట వరకు వెళ్ళినట్లుగా గుర్తించారు. అక్కడ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్ళి, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ కు వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బీదర్ లో దోపిడీ, కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్ లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్, బీదర్ పోలీసులు జాయింత్ ఆపరేషన్ చేపట్టారు. దోపిడి ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.