Take a fresh look at your lifestyle.

అరపైస అవినీతి  జరగలేదు

  • తప్పు చేయలేదు….నన్ను ఏం చేయలేడు
  • కేసులపై న్యాయ పోరాటం చేస్తా…ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటా
  • ఈ..కారు రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాం
  • కేసుల విషయంలో ఇది ఆరంభం మాత్రమే
  • రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అన్ని విచారణలకు హాజరవుతా
  • మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- పార్ములా ఈ..కారు రేసులో అరపైస అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదొక లొట్టపిట్ట కేసు తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారన్నారు. నేను తప్ప చేయలేదు… నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ పెట్టిన కేసులపై ఒక న్యాయం పోరాటం చేస్తూనే  ఉంటా….మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
హైకోర్టులో క్వాష్ పిటిష‌న్‌ను కొట్టేయ‌గానే ఏదో జ‌రిగిన‌ట్టు కాంగ్రెస్ నేత‌లు శున‌కానందం పొందుతున్నార‌ని ఆయన మండిప‌డ్డారు. హై కోర్టు నాకు శిక్ష వేయలేదు… ఎక్కడా అవినీతి జరిగిందని  చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నాయకుల్లా దివాళా కోరు పనులు చేయమన్నారు. బీఆర్ఎస్  ప్రభుత్వం ఏం చేసినా అది కేవలం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పనిచేసిందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో మరింతగా ప్రఖ్యాతలు రావాలన్న లక్ష్యంతోనే ఈ…కారు రేసును తీసుకొచ్చామన్నారు. ఈవీల‌కు తెలంగాణ‌ను కేంద్రం చేయాల‌నే ఆలోచ‌న చేశామన్నారు. ఇదే కేసులో ఈడీ కూడా పిలిచిందని.. వారి ద‌గ్గ‌కు కూడా పోతానని స్పష్టం చేశారు. వారు అడిగిన  ప్రశ్నలకు స‌మాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నానని అన్నారు.ఇందులో ఎలాంటి దాప‌రికం లేదు.. దాచాల్సింది ఏం లేదన్నారు.దీనిపై అందురు హర్షించాల్సింది పోయి…కోి గుడ్డుపై ఇకలు పీకుతున్న చందంగా….ఏదో అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల విషయంలో ఇది ఆరంభం మాత్రమేనని…మునుముందు అనేక కేసులను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. ఇది మాకు కూడా తెలుసన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయమని స్పష్టం చేశారు.
మంగళవారం రాత్రి  నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలకు న్యాయస్థానంలోనే తగు సమాధానం ఇస్తామన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. తనపై పెట్టిన కేసులపై  లాయ‌ర్ల స‌మ‌క్షంలో విచార‌ణ కోసం మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.  రోషంగ‌ల్ల బిడ్డ‌గా ఏ విచార‌ణ‌నైనా ఎద‌ర్కొంటానని స్పష్టం చేశారు.
ప‌చ్చ కామెర్ల వారికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌న‌బ‌డుత‌ది  అన్న విధంగా అవినీతిప‌రుల‌కు రూ.50 ల‌క్ష‌ల‌తో దొరికిన దొంగ‌ల‌కు……. పొలిక‌టిక్ బ్రోక‌ర్ల‌కు ప్ర‌తి కార్య‌క్ర‌మంలో ఎంతో కొంత చేతులు మారింట‌ద‌నే ఒక మూర్ఖ‌పు తెలివి, త‌క్కువ ఆలోచ‌న ఉంటందని ఎద్దేవ చేశారు. అది స్వ‌త‌హాగానే పుర్రెలో పుట్టింది పోద‌న‌న్న‌ట్టు పుట్టుక‌తో వ‌చ్చిన బుద్ధి అది …. అని కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.   భార‌త పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌర‌వించే పౌరుడిగా ఇది అక్ర‌మ కేసు అని మళ్లీ చెబుతున్నానని పేర్కొన్నారు. బ‌ట్ట‌కాల్చి మీద వేసి ఏదో జ‌రిగింద‌ని చూపేట్టే క‌క్ష సాధింపు కేసులు అని అన్నారు. అయినప్పటికీ ఏసీబీ విచార‌ణ‌కు కూడా వెళ్లానని అన్నారు.  ఉత్తుతి కేసు పెట్టి, క‌థ‌లు అల్లి శునకానందం పొందుతున్న చిట్టి నాయుడి (రేవంత్)కి ఒక మాట చెప్పాల్సి ఉందన్నారు. చ‌ట్టాన్ని గౌర‌వించే పౌరుడిగా.. నువ్వు అక్ర‌మ కేసులు పెడితే.. బుర‌ద జ‌ల్లితే న్యాయ‌ప‌రంగా, రాజ్యంగా ప‌రంగా ప్ర‌తి హ‌క్కును వినియోగించుకుంటానని అన్నారు. ఏసీబీ విచార‌ణ‌కు లాయ‌ర్‌ను తీసుకెళ్తానంటే  రేవంత్ భ‌య‌ప‌డ్డాడని అన్నారు. ప్ర‌శ్న‌లు అడిగేందుకు ప్ర‌భుత్వం వెన‌క్కి పోయిందన్నారు.
నేడు మళ్లీ హై కోర్టుకు
 ఏసీబీ అధికారులు లాయ‌ర్ల స‌మ‌క్షంలో విచార‌ణ జ‌ర‌పాల‌ని నేడు మళ్లీ హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని కేటీఆర్ తెలిపారు. కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి, చ‌ట్ట‌ప‌ర‌మైన రక్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టును కోరుతాన‌ని అన్నారు. తనకు ఈ దుర్మార్గుల నుంచి చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని కోర్టును ప్రాధేయ‌ప‌డుతాను అని కేటీఆర్ పేర్కొన్నారు. కొంత‌మంది మంత్రులు  వారే న్యాయ‌మూర్తులు అయిపోతున్నారన్నారు. వాళ్లే శిక్ష‌లు వేస్తున్నారన్నారు. ట్ర‌య‌ల్ మీడియాలో, స‌చివాల‌యంలో, మంత్రుల పేషీల్లో జ‌ర‌గదన్నారు. అది కేవలం కోర్టుల్లోనే జ‌రుగుతుందన్నారు.మేం కోర్టుకు పోతే  మంత్రులకు ఎందుకు ఉలికిపాటు ఎందుకు..? అని ప్రశ్నింంచారు.
పత్రికా మిత్రులు ఆగం కావద్దు….. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చేది వేదవాక్కు కాదన్నారు. కేవలం లీకులు ఇచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టమని బీఆర్ఎస్ కోరితే….. ముఖ్యమంత్రి పారిపోయాడన్నాడు. రేవంత్ రెడ్డి మగాడు అయితే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో చర్చ పెడితే మీడియా సమక్షంలో నేను చర్చకు రెడీ అని అన్నార. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా ఈడీ విచారణకైనా  రెడీ  అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా…. అయితే తమది  ఇంట్రెస్ట్ ఫార్మర్ అని అన్నారు. మేము రైతు భరోసా గురించి మాట్లాడతామన్నారు. వీటి డైవర్షన్ కోసం రేవంత్ ఏం చేస్తున్నాడో మాకు తెలుసన్నారు. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం చేయడం ఇదే కాంగ్రెస్ నైజమని మండిపడ్డారు.
అన్న దాతలు ఎదురు చూస్తున్నారు
రైతు భరోసా ఎప్పుడు వస్తుందని 75 లక్షల మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇస్తే….. చిట్టి నాయుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. ఈసారైనా ఇస్తాడా అని తెలంగాణ రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నారు.  వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలని బీఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తూనే ఉంటారన్నారు.
ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన రూ. 2500,  వృద్ధులకు ఇవ్వాల్సిన రూ. 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పార్టీ నేతలకు సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు.ఫార్ములా కేసు విషయంలో మీడియా చేస్తున్న హడావుడికి పార్టీ కార్యకర్తలు ఆగం కావద్దు అని సూచించారు. ఫార్ములా కేసు విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీడియా, ప్రజలు పడుతున్న బాధల్ని చూపించడంలోనూ చూపించాలని కోరారు.
అన్ని పార్టీలకు విరాళాలు 
గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకొని రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక బీఆర్ఎస్సే కాదు… కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైఎస్ఆర్సిపి ఇలా అన్ని పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిందన్నారు. ఒక్క టిఆర్ఎస్ పార్టీ మీదనే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారు ? అని ప్రశ్నించారు. అసలు క్విడ్ ప్రో కో అంటే అర్థం కాంగ్రెస్ నాయకులకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుసా? అని నిలదీశారు.  బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన గ్రీన్ కో కు ప్రతిఫలంగా ఏం దక్కిందో  నిరూపించగలరా? అని సవాల్ చేశారు.
ఒక కాంట్రాక్టర్ మంత్రిగా ఉంటే…. ఇంకో బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని ధ్వజమెత్తారు. వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.