ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడారం మినీ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు మంగళవారం మేడారం మినీ జాతరపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, మేడారం పూజారులు, ఇతర అధికారులు హజరయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.