Take a fresh look at your lifestyle.

బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆర్.జి-3 జి.యం

రామగిరి, ముద్ర: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 62.50 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 65.11 లక్షల టన్నులు అనగా 104 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 500.90 క్యూబిక్ మీటర్ల ఓ.బి (మట్టి) వెలికితీత లక్ష్యానికి గాను 78 శాతం అనగా 389.52 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీయడం జరిగిందన్నారు.అలాగే 2024 -25 ఆర్థిక సంవత్సరంలో 78.11 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు.మార్చి నెలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 6.08 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 9.54 లక్షల టన్నులు అనగా 157 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 40.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి) వెలికితీత లక్ష్యానికి గాను, 39.40 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 97 శాతం ఓ.బి (మట్టి) వెలికి తీయడం జరిగిందని, అదేవిధంగా 7.75 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.తదుపరి గనులవారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ మార్చి నెలలో ఓ.సి.పి-1 గనికి నిర్దేశించిన 3.28 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 5.79 లక్షల టన్నులు అనగా 177 శాతం, ఓ.సి.పి-2 గనికి నిర్దేశించిన 2.80 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.75 లక్షల టన్నులు అనగా 134 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.ఇందుకు కృషి చేసిన అధికారులకు, ఉద్యోగులకు, కార్మిక సంఘ నాయకులకు అభినందనలు తెలియజేశారు.భవిషత్తులో కూడా ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించడానికి కృషి చేయాలన్నారు. రామగుండం-3 ఏరియాకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.