- ఆర్కేపీ బీఅర్ఎస్ నాయకులు
రామకృష్ణాపూర్, ముద్ర : క్యాతన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనుల కొరకు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అహర్నిశలు కృషి చేశారని ఆర్కేపీ పట్టణ బీఅర్ఎస్ నాయకులు గుర్తు చేశారు.శనివారం బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్,బాల్క సుమన్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ గెలిచి సంవత్సర కాలం అవుతున్న ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.