Take a fresh look at your lifestyle.

సెంట్రింగ్ కాంట్రాక్టర్లు,కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

 

ముద్ర కాప్రా

కాప్రా జోన్‌లో పద్మశాలి టౌన్ షిప్ లో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శనివారం అమావాస్య నుండి చేపట్టిన సమ్మెలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రింగ్ వర్కర్లకు అనేక సమస్యలు ఉన్నాయని, వారికి రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, అలాగే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి కార్మికుడికి పెన్షన్ ప్రకటించాలని ప్రభుత్వానికి తన వంతుగా నివేదిక సమర్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేష్ గౌడ్ ,సెంట్రింగ్ నాయకులు కనకరాజ్ గౌడ్, మంచాల మల్లేష్, బాల్దె శ్రీశైలం, కుందనపల్లి మల్లేష్, జహంగీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.