ముద్ర మల్కాజిగిరి
మౌలాలీలో జనగణన పనులపై కమిషనర్ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్
మౌలాలీలో జరుగుతున్న జనగణన ప్రక్రియను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆనంద్‌బాగ్ మెయిన్ రోడ్, ఏఎన్‌ఆర్ నగర్ కాలనీలలో జోనల్ కమిషనర్, డీసీ, డీఈలతో కలిసి ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతో కమిషనర్ మాట్లాడి వారి పనితీరు, విధుల నిర్వహణ, సమయపాలనపై వివరాలు తెలుసుకున్నారు. హాజరు, పనితీరుపై కఠిన పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియను సమయానికి, ఖచ్చితత్వంతో, సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు