వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనికి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో 5000 మెట్రిక్ టన్నుల గోదాం లో 2 గోదాములో హుస్నాబాద్, అక్కన్న పేట మండలాలకు సంబంధించిన వారి ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని తెలిపారు.ఒక గోదాములో దాదాపు పూర్తిగా నిండిందని ఇంకో గోదాం లో ఉన్న గన్ని బ్యాగులను వేరొక గోదాములకి తరలించి ఇందులో కూడా ధాన్యాన్ని దిగుమతి చెయ్యాలని తెలిపారు. అకాల వర్షాల వలన రైతులు నష్టపోకుండా ఈ మార్కెట్ కమిటీ గోదాములో ప్రస్తుతానికి ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు.ఈ ఏఏంసి లలో హమాలీ ఇందులో మాత్రమే పని చెయ్యాలని బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి నీ ఆదేశించారు. ఏ ఏం సి లో రైతులతో మాట్లాడుతూ.వచ్చే ఖరీఫ్ లో సన్న వడ్లన పండించాలని, సన్న వడ్లకు బోనస్ తో పాటు మన జిల్లాలో పండించిన బియ్యం జిల్లాలోని ప్రజలకు సరిపోతుందని సూచించారు. రేషన్ షాప్ లలో సన్న బియ్యం సరిపోక వేరే జిల్లాల నుండి దిగుమతి చేసుకున్నట్లు అందుకే రైతులు సన్న వరి పండించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏసిపి సదానందం, తహసిల్దార్ లక్ష్మా రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.