వికసించిన తెలుగు పద్మాలు
ఉభయ రాష్ట్రాలకు చెందిన 11 మందికి పద్మ శ్రీ పురస్కారాలు
తెలంగాణ నుంచి మామిడి రామరెడ్డికి వరించిన పద్మశ్రీ
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగాల్లో అందించిన సేవలకు గుర్తింపు
సినీనటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ కు వరించిన అవార్డు
యూజీసీ మాజీ ఛైర్మన్ జగదీశ్ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’పురస్కారాలు ప్రకటించింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులను ఆదివారం ప్రకటించింది. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ కు ఎంపికయ్యారు. అలాగే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామా రెడ్డి, కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ లకు పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందికి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేయగా.. వాటిలో ఏపీ, తెలంగాణకు చెందిన 11 మందికి ఈ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్ లోని సీసీఎంబీలో పని చేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‍కు జన్యుసంబంధ పరిశోధనలకు వారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై ఆయన పలు పరిశోధనలు చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
పద్మవిభూషణ్
ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్
అచ్యుతానందన్(కేరళ)కు మరణానంతరం పద్మవిభూషణ్
కె.టి.థామ్‌స్(కేరళ)కు పద్మవిభూషణ్
సాహితీవేత్త పి.నారాయణన్(కేరళ)కు పద్మవిభూషణ్
కళల విభాగంలో ఎన్.రాజాం(ఉత్తరప్రదేశ్)కు పద్మవిభూషణ్
పద్మభూషణ్
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరేన్‌కు పద్మభూషణ్
క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్‌కు పద్మభూషణ్
ప్రజావ్యవహారాల విభాగంలో వి.కె.మల్హోత్రాకు పద్మభూషణ్
కళల విభాగంలో మమ్ముట్టి(కేరళ)కి పద్మ భూషణ్
ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్రాత్రేయుడుకు పద్మభూషణ్
గాయని ఆల్కా యాజ్ఞిక్(మహారాష్ట్ర)కు పద్మభూషణ్
మాజీ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి(ఉత్తరాఖండ్) పద్మభూషణ్
తెలుగు ‘పద్మశ్రీ’లు
సినీనటుడు మురళీమోహన్‌కు పద్మశ్రీ
సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ
ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు పద్మశ్రీ
ఏపీకి చెందిన వేంపటి కుటుంబశాస్త్రి(సాహిత్యం)కి పద్మశ్రీ
తెలంగాణకు చెందిన గూడూరు వెంకట్రావు(వైద్యం)కు పద్మశ్రీ
తెలంగాణకు చెందిన కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్(సైన్స్)కు పద్మశ్రీ
తెలంగాణకు చెందిన గడ్డమనుగు చంద్రమౌళి(సైన్స్ విభాగం)కి పద్మశ్రీ
తెలంగాణకు చెందిన దీపికారెడ్డి(నృత్యకారిణి)కి పద్మశ్రీ
తెలంగాణకు చెందిన పాలకొండ విజయ్‌ఆనంద్‌రెడ్డి(వైద్యం)కు పద్మశ్రీ
అంకె గౌడ (సాహిత్యం – కర్ణాటక)
తంగరాజ్ (హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త)
ఎస్‌జీ సుశీలమ్మ
సంగ్యుగామ్
షఫీ సౌదిక్
శ్రీరంగ్ దేవబాలద్
ష్యామ్ సుందర్
సింహాచల్ పాత్రో
సురేశ్ హనఘవాడి
తాగరామ్ భీల్
తేచి గుబిన్
తిరువయ్యూర్ భక్తవత్సలం
విశ్వ బంధు
యమున్ జాత్ర సింగ్
అర్మిడ ఫెర్నాండెజ్ (మహారాష్ట్ర)
భగవాన్‌దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్)
భిక్‌ల్యా లదక్య దిండా
బ్రిజ్‌లాల్ భట్ (జమ్ముకశ్మీర్)
బుద్రి తాటి
చరణ్ హెబ్రామ్
చిరంజి లాల్‌యాదవ్
ధార్మిక్‌లాల్ చునిలాల్ పాండ్య
గఫ్రుద్దీన్ మెవాటి జోగి
హాలీ వార్
ఇంద్రజిత్ సింగ్ సింధు
కె.పజనీవెల్
కైలాశ్ చంద్ర పంత్
ఖెమ్ రాజ్ సుంద్రియాల్
కొల్లాక్కయిల్ దేవకి అమ్మ జీ
మహేంద్ర కుమార్ మిశ్రా
మిర్ హజీభాయ్ కసమ్‌భాయ్
మోహన్ నగర్
నరేష్ చంద్ర దేవ్ వర్మ
నీలేష్ వినోద్‌చంద్ర మండేవాలా
నూరుద్దీన్ అహ్మద్
ఒత్తువర్ తిరుత్తణి స్వామి నాథన్
పద్మ గుర్మీత్
పోహిలా లక్తెపి
పుణ్యమూర్తి నటేషణ్
ఆర్.కృష్ణన్
రఘుపత్ సింగ్
రఘువీర్ తుకారామ్ ఖేద్కర్
రాజస్తపతి కలిప్ప గౌండర్
రామకృష్ణారెడ్డి మామిడి
రామచంద్ర గాడ్‌బోలే – సునీత గాడ్‌బోలే