Take a fresh look at your lifestyle.

తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలి *ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, కుషాయిగూడ :

కాప్రా సర్కిల్ వ్యాప్త కాలనీలలో అంతరాయం లేకుండా నాణ్యంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలనిషఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు.
కుషాయిగూడ డివిజన్ పరిధిలోని కాలనీలలో గత 15 రోజులుగా అస్తవ్యస్తంగా నీటి సరఫరా జరుగుతుందని తాగేందుకు చుక్క నీళ్లు దొరక్క జనం అవస్థలు పడుతున్నారని వివరిస్తూ కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలనీలలో బోర్లు ఎండి కుటుంబాలు నల్ల నీటిపైనే ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గుర్తిరెగి అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని జలమండలి డీజిఎం హర్షితకు సూచించారు.
కుషాయిగూడ డీమార్ట్ దగ్గర లీకేజీ అయిన పైపులైన్ కు మరమ్మతులు చేయించి గతంలో మాదిరిగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, నాయకులు నేమూరి మహేష్ గౌడ్, సిసిఎస్ ప్రతినిధులు గంప కృష్ణ, జై కృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.