నాడైనా… నేడైనా.. ఎప్పుడైన అన్నింటా అగ్రగామి సిద్దిపేట
* కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సిద్దిపేట పల్లెలకు వలస కార్మికులు
* మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
నాడైనా… నేడైనా.. ఎప్పుడైన అన్నింటా అగ్రగామి సిద్దిపేట అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 300 మందికి రూ. 62 లక్షల 88 వేల విలువైన చెక్కుల పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ

రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందిన నియోజకవర్గం సిద్దిపేట అన్నారు. సిద్దిపేటలో ఇప్పటివరకు 12,857 మందికి 41 కోట్ల 13 లక్షల ఆర్థిక సాయం అందజేశామాన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండుటెండల్లోనూ సిద్దిపేట కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయాన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85,000 ఎకరాల్లో వరి సాగు జరిగుతుందన్నారు.
ఒకప్పుడు బొంబాయి, దుబాయ్ కి వలసపోయిన సిద్దిపేట ఇప్పుడు బీహార్, ఛత్తీస్‌గఢ్ కూలీలకు ఉపాధి చూపుతోందన్నారు. వ్యవసాయంతో పాటు ఐటీ, పారిశ్రామిక రంగాల్లోనూ సిద్దిపేట అభివృద్ధి పరుగు పెడుతోందాన్నరూ. దయచేసి ఈ చెక్కులను వెంటనే మీ బ్యాంకులో వేసుకోండి. డేట్ మారితే ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు గాని, ఎల్లుండి గాని డిపాజిట్ చేసుకోండణి సూచించారు.ఎండాకాలంలో కూడా మన సిద్దిపేటలో 85 వేల ఎకరాల్లో వరి ధాన్యం పండుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనకు నిజంగా ఒక వరం. ఆ కాళేశ్వరమే లేకపోతే మన సిద్దిపేట ఇలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఎకరానికి 4 నుంచి 5 వేల రూపాయలు మాట్లాడుకుని వరి నాట్లు వేసిపోతున్నారు. బొంబాయి పోయిన మనం.. వేరే వాళ్లకు ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు సాగునీరు పుష్కలంగా ఉండటంతో నంగునూరు, చిన్నకోడూరులో రైతులు మిర్చి సాగు చేసి నాలుగు రూపాయలు గట్టిగా సంపాదిస్తున్నారన్నారు.ఇంకొంతమంది ఆయిల్ పామ్ తోటలు పెట్టి లాభాలు పొందుతూ, బాగుపడుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంతో పాటే మన పిల్లల ఉపాధి కోసం మిట్టపల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొన్ని పరిశ్రమలు తెచ్చామన్నారు.
సిద్దిపేట ఐటీ పార్క్ ద్వారా ఇప్పటికే 600 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించగలిగామని
-అటు వ్యవసాయం, ఇటు ఉపాధి, మరోవైపు ఐటీ రంగం.. ఇలా అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలిపామన్నారు.రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి సిద్దిపేటను అగ్రగామిగా నిలుపుకుందామన్నారూ.