ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
జగదేవ్ పూర్ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి బుధవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భగార అన్నం, మిల్మికర్ కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు. రోజు డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలను రుచికరంగా వండాలని, వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ పరి శుభ్రంగా ఉంచుకోవాలని వంట సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థులకు వడ్డించే ప్రక్రియను పరిశీలిస్తూ మొదటగా కూర తర్వాతనే అన్నం వడ్డించాలని విద్యార్థులకు మరల అన్నం కూరలు వారు కూర్చున్న వద్దకు వెళ్లి వడ్డించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు కరాటే తప్పనిసరిగా నేర్చుకోవాలని ముఖ్యంగా బాలికలకు, ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి కరాటే శిక్షణ అత్యంత ఆవశ్యకం. రాష్ట్ర ప్రభుత్వం బడులలో విద్యార్థినులకు ఉచిత శిక్షణ ఇస్తోందనీ. ఇది క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఏకాగ్రత, ఆపద సమయంలో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలను నేర్పుతుందనీ తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. స్టాక్ రిజిస్టర్ తనికి చేస్తూ పలు సూచనలు చేశారు. విద్యాలయంలో సిసి కెమెరాలు పెట్టించుకోవాలని ఎస్ఓ ను ఆదేశించారు.అనంతరం మండలంలోని తీగుల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో మేజర్ మైనర్ రిపేర్ పనుల గురించి ఆరా తియ్యగా మీకు మంజూరురైన ప్రతిదీ తప్పనిసరిగా కాంట్రాక్టర్ తో చేయించుకోవాలని ఆదేశించారు