Take a fresh look at your lifestyle.

సీఎం సహాయనిధి ఒక గొప్ప వరం

ముద్ర,‌గద్వాల:

సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, మల్దకల్, గద్వాల మండలాలకు చెందిన‌ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.