Take a fresh look at your lifestyle.

ఎప్‌సెట్ ఫలితాల్లో ఎస్ ఆర్ విద్యార్థుల హవా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఎప్‌సెట్ ఫలితాల్లో నిర్మల్ ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారు. కళాశాలకు చెందిన జె శ్వేత రాష్ట్రస్థాయి 351 ర్యాంక్ సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అలాగే కె దియాశ్రీ 5826, కె సాహితి 7637, శ్రీహర్ష 11053,కె సంకీర్తన 11609, కె అఖిల 12806, బి చంద్రకళ 13,591, లక్ష్మీప్రసన్న 15,824 ర్యాంకులతో పాటు 9 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాసంస్థల డి జి ఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా, ఎప్‌సెట్ ఫలితాల్లో కూడా నిర్మల్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడం కళాశాలకూ, విద్యార్థులకూ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ నగేష్ యాదవ్, కళాశాల డీన్ రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.