Take a fresh look at your lifestyle.

ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచండి

  • సీపీఎం నేతలు శ్రీకాంత్, వై విక్రమ్

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచాలని కోరుతూ సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ ఈఈకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ ఆన్ లైన్లో వివిధ కారణాలతో కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ప్రతి దరఖాస్తుదారుడ్ని అధికారులు పిలిచి ఎల్ఆర్ఎస్ పై అవగహన కల్పించాలని కోరారు.వేలాది ధరఖాస్తులు పెండింగ్లో వుండటానికి గల కారణాలను కూడా వివరించాలన్నారు. ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని లేదా స్వయంగా సమస్య ఎక్కడ వుందో తెలియ జేయాలని సూచించారు.చెరువు శిఖం భూములు, మున్నేరు బఫర్ జోన్ భూములు, ప్రభుత్వ భూముల్లో వేసిన వెంచర్స్ లో దరఖాస్తుల పరిస్థితి ఏంటన్న దానిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైట్ రేషన్ కార్డు వున్న వారికి శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో భుక్యా శ్రీనివాసు రావు, బోడపట్ల సుదర్శన్, వజేనేపల్లి శ్రీనువాస రావు, ఎల్లంపల్లి వెంకట్రావు, నాగులు మీరా, ఇమామ్, నర్రా రమేష్, మెహరిన్నిసా బేగం, కె శ్రీనువాస రావు , వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.