ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ దీపక్ తివారి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను కుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమములో ఆర్ డి ఓ వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మి నారాయణ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.