Take a fresh look at your lifestyle.

నాణ్యమైన ఆహరంతోనే మెరుగైన జీవనం -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆహారంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దిపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మి బాయి ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను చేపడుతుందని, ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రం లోని సంగం లక్ష్మి బాయి ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు.మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందని, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఉత్తమ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతిరోజు ప్రజలు రోజువారి కార్యక్రమాల హడావిడిలో పని భారంతో కూడిన జీవనశైలిలో సతమతమవుతూ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అందుబాటులో బయట లభించే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. పొంచి ఉన్న అనారోగ్య ఉపద్రవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు.
ఆహారమే మహాభాగ్యం అనే అంశాన్ని గుర్తు చేసుకుంటూ జంక్ ఫుడ్ స్వస్తి పలుకుతూ తాజా కూరగాయలు, వేడి భోజనం, ఇంట్లో వంటకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు రోజువారీ జీవితంలో పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని కోరారు. తిను బండారాలు, భోజనశాలలు, అల్పాహార కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, భోజన తయారీకి ఉపయోగించే ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
అంగన్వాడి టీచర్లు, ఎస్సి, ఎస్సిటి , బి సి వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు వార్దేన్స్ కు ఫుడ్ సేఫ్టీ పైన అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో జాడ్ పి సి ఇ ఓ సుదీర్, డి ఎం హెచ్ ఓ స్వర్ణ కుమారి, ఫుడ్ సేఫ్టీ అధికారి జగన్నాథo, విద్యార్థినిలు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.