కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణంలోని గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా సోమవారం రోజున అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుల మధ్య అంగరంగ వైభవంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి కోరుకున్న కోరికలు తీర్చిన అమ్మవారికి భక్తితో నైవేద్యంగా బోనం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దయతో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జెల శంకర్, కోశాధికారి అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్ కార్యకర్తలు కటుకం గంగారాం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
