Take a fresh look at your lifestyle.

6వ వార్డు అభ్యర్థి వివేకానందను భారీ మెజార్టీతో గెలిపించాలి…. గెలుపుకై సిపిఎం కళాకారుల ప్రచారం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి కొలుపుల వివేకానందను భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం, బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కళాకారులు, కవులు ప్రదర్శన, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ ఓటర్లను సుత్తి కొడవలి గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు.


ఈ సందర్భంగా జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్, 26వ వార్డు మాజీ కౌన్సిలర్ బట్టుపల్లి అనురాధలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి కొలుపుల వివేకానందా అని, కార్మికులు, పేదలు, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలబడే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముల్కల సత్యనారాయణ, గంటేపాక బిక్షపతి, నీలం శ్రీనివాస్, బుగ్గ రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.