- జిల్లా అధికారికి మాల సంఘం నాయకుల వినతి.
యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీల్లో తమను కూడా నియమించాలని కోరుతూ, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేసినట్లు రామగుండం కార్పొరేషన్ ఏరియా మాల సంఘం నాయకులు సోగాల వెంకటి, మర్రి ఐలయ్య, ఎరుకల లక్ష్మణరావు, కడమండ్ల శ్రీహరి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. గతంలో ఏర్పాటు చేసిన జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీల్లో అప్పటి అధికారులు మాల కులానికి చెందిన సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించకుండా విస్మరించారని వారు ఆరోపించారు. మాల సంఘం ఏర్పడిన నాటి నుంచి, మాల కులస్తులను ఒకే వేదికపై చేర్చి, సంఘం గా, ఏర్పడి అభివృద్ధికి, హక్కుల పరిరక్షణకు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తూ వస్తోందని వారు తెలిపారు. రానున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీల్లో తమ సంఘానికి చెందిన ప్రతినిధులను సభ్యులుగా చేర్చాలని, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని కోరినట్లు నాయకులు ఆ ప్రకటనలో వివరించారు. విన్నవించినట్లు సంఘం నాయకులు ఆ ప్రకటనలో వివరించారు.