రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈ నెల 20 న జరిగే బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్,క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు పరిశీలించారు.జాతరకు వచ్చే భక్తులు నిర్దేశించిన స్థలాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.