Take a fresh look at your lifestyle.

తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి: సీతారాం ధూళిపాళ

గండిపేట్ ముద్ర విలేకరి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్ర‌జ‌ల తాగునీటి స‌మ‌స్య‌కు అధికారులు ప‌రిష్కారం చూపాల‌ని భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ నాయకులు సీతారాం ధూళిపాళ డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారుల నిర్ల‌క్ష్యాన్ని పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ఖండించారు. బుధ‌వారం జ‌ల‌మండ‌లి కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకొని ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం అధికారుల‌కు విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాన సమస్యలలో మొదటగా 2025 ఫిబ్రవరి 6 న అలుకాపూర్, ఎల్ఐసి కాలనీలలో ఉన్న రిజర్వాయర్లను తూతూ మంత్రంగా మొదలు పెట్టార‌ని, ప్రారంభం చేసి మిన్నకుండడం చేతగాని తనంగా భావించవలసి వస్తూ ఉందని ప్రజలు తీవ్రంగా దుయ్యబట్టారు. పెద్ద పెద్ద అపార్ట్మెంటులకు కట్టడి లేని విధంగా నీటి సరఫరా ఇవ్వడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయమై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయాలని, సామాన్య ప్రజల వద్ద ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్నారని, చట్ట పరిధిలో లేని వాల్వు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, కానీ అందుకు ప్రతి ఫలంగా ఛార్జీ చేసిన మేర నీటిని విడుదల చేయడం లేదని ప్రతి ఇంటికి సమన్యాయంగా నీటిని సరఫరా చేయాలని అన్నారు. మున్సిపల్ చట్ట పరిధి ప్రకారం 240 గజాల ఇండ్లు, అపార్ట్మెంటు మాదిరి కట్టడాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లు జారీ చేయవలసిన అవసరం లేదని, ఆ విషయమై తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటి అంతర్భాగమైన జలమండలి అధికారులకు ఎంత మాత్రం అధికారం లేదని, కానీ జలమండలి అధికారులు చట్టం మా చుట్టం అనుకొంటూ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ మునిసిపల్ పర్మిషన్ కు విరుద్ధంగా కట్టడం కట్టావని దృష్టికి తెస్తూ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఇష్టానుసారం మెదులుతూ ఇబ్బడి ముబ్బడిగా జలమండలి నీటి సరఫరాకు బిల్లులు వసూలు చేస్తున్నారని ప్రజలు తెలుపగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో కుంభగళ్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపరెడ్డి, ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మణ్ రావు అందే, రాజేంద్ర ప్రసాద్, సంగం శ్రీకాంత్, కిరణ్ యాలాల, బొడ్డు శ్రీధర్, బాబు రావు, ఆరిఫ్ మొహమ్మద్, సుమ నళిని, భాను చందర్, మాల్యాద్రి నాయుడు, షేక్ ఆరిఫ్, అజయ్, చెరుకూరి బాలాజీ, నర్సింగ్ రావు, బెన్నీ, ఆశ్వక్ అలీ, అష్రఫ్, నరసింహ రెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.