Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ధర్మపురి ఎమ్మెల్యే, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో బుధవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వందేళ్లు జీవిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడ్వాల జ్యోతి లక్ష్మణ్, ఏఎంసీ ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.