Take a fresh look at your lifestyle.

జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో నాకాబంది

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబంది నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన చౌరాస్తాలు, రహదారులు, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి నంబరు ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన పత్రాలు, లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహన చోదకులకు చలానాలు విధించారు. జిల్లా వ్యాప్తంగా 156 స్పాట్ చలానా కేసులు నమోదు కాగా, రూ.37,200 జరిమానా విధించారు. 228 వాహనాలకు రూ.57,090ల జరిమానా విధించారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 173 వాహనాల చలనాల మొత్తం రూ. 57,855 వసూలు చేశారు. 41 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ నాకాబందిలో నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ భైంసా పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.