ముద్ర ప్రతినిధి, జగిత్యాల: లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ భవిష్యత్ ఆశా జ్యోతి రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఎస్ ఆర్ ఎస్పి ప్రాజెక్ట్ పునాది వేసింది రాహుల్ గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
