వికారాబాద్, ముద్ర విలేకరి : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ అధి నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ పాల్గొని కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 613 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.