రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధిత ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ఉండాలని బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ సూచించారు. గురువారం ఆర్కేపీ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. నమోదైన కేసులు,సీజ్ చేసిన వాహనాల వివరాలను పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రెండో ఎస్సై లలిత,డబ్ల్యూఏఎస్ఐ ఐ రజిత,హెడ్ కానిస్టేబుల్ అంకయ్య ఉన్నారు.