- ల్యాండ్ క్లీనింగ్ పనులు ప్రారంభించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా సమీపంలోని మెడికల్ కళాశాల దగ్గర నిర్మిస్తున్న నూతన న్యాయస్థానం కోర్టు భవనానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా శనివారం ల్యాండ్ క్లీనింగ్ పనులకు పూజలు నిర్వహించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ తో పాటు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పనులు ప్రారంభించారు. గత నెలలో నూతన కోర్టు భవనానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో భవన నిర్మాణం పనులకు లైన్ క్లియర్ అయిందని అందువల్లనే ల్యాండ్ క్లీనింగ్ పనులు ప్రారంభించడం జరుగుతుందని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. మెడికల్ కళాశాల సమీపంలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ న్యాయస్థానం కోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారని ఇందుకు సంబంధించిన ల్యాండ్ క్లీనింగ్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ తో పాటు తిరుపతి గౌడ్. చంద్ర శేఖర్ రావు, భరత్ కుమార్, రఘువంశి. పురుషోత్తం, రాజు, శ్రీనివాస్ గౌడ్, బాబా, నరేందర్, భరత్ కుమార్, కిషోర్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు.