Take a fresh look at your lifestyle.

100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకోవాలి

  • పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత అధికార్లను ఆదేశించారు. శనివారం ఆయన అశ్వాపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేసే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పని చేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.