Take a fresh look at your lifestyle.

నామినేషన్ల స్క్రోటిని 35 వార్డులకు 181.. 2 నామినేషన్లు తిరస్కరణ

నామినేషన్ల స్క్రోటిని
35 వార్డులకు 181..
2 నామినేషన్లు తిరస్కరణ
ముద్ర ప్రతినిధి , భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీకి దాఖలైన నామినేషన్ పత్రాలను శనివారం అధికారులు స్క్రోటిని నిర్వహించారు. 35 వార్డులకు గాను 305 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు కాగా వాటిని స్క్రోటిని చేయగా 2 నామినేషన్ పత్రాలలో సంతకాలు లేకపోవడంతో తిరస్కరించడం జరిగిందని అధికారులు తెలిపారు. మొత్తం 181 నామినేషన్లు సరిగా ఉన్నట్లు చెప్పారు. అందులో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున 55 నామినేషన్లు దాఖలు కాగా , ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ తరపున 51, బీజేపీ పార్టీ నుండి 45 , బిఎస్పీ 3, కమ్యూనిస్టులు 1, ఏఐఎంఐఎం 2, స్వతంత్ర అభ్యర్థులుగా 24 నామినేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈనెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.