ముద్ర ప్రతినిధి, మెదక్:
విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్ సభ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న కుల వృత్తులు, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. వారికి త్వరలోనే టూల్ కిట్స్ అందిస్తామన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. విశ్వకర్మల ఆర్దిక అభివృద్ధి ఈ పథకం ద్వారా సాధ్యమన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ గుల్షన్ సింగ్, లీడ్ బ్యాంకు మేనేజర్ బాపూజీ, విశ్వకర్మ పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.