కోరుట్ల/కథలాపూర్, ముద్ర; షాట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమైన ఘటన కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గొళ్ళెం హన్మక్క 62 పూరి గుడిసె లో నివసిస్తుంది. ఈ క్రమంలో సోమవారం రోజు ఉదయం 9 గంటల సమయంలో తను నివసిస్తున్న పూరి గుడిసెలో ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ జరగడంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది.అందులో ఉన్న బట్టలు సరుకులు పూర్తిగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక నష్టం కాగా తలదాచుకునే పరిస్థితి లేకుండా పోయిందని హన్మక్క ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ,కథలాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చెర్ పర్శన్ పులిహరి ప్రసాద్ శిరీష తన వంతు సహాయంగా 5 వేల రూపాయలను హ్యన్మక్క కు అందించి ఔదార్యాన్ని చాటారు.మరికొంత మంది ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.