హనుమకొండ ,ముద్ర : హనుమకొండ వడ్డేపల్లి వంద ఫీట్ల రోడ్ లో గత మూడు రోజులుగా జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్ కు క్రీడాకారుల నుండి అనూహ్య స్పంద వచ్చింది.వరంగల్ మహానగర పరిధిలో మొట్టమొదటి సారినిర్వహించిన పికల్ బాల్ టోర్నమెంట్ పోటీలు సోమవారం నాడు విజయవంతగా ముగిసాయి.క్రీడా పోటీల్లో పదహారు జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి.ఫైనల్ పోటీ ముగిసాగా మొదటి స్థానం లో వెంకటేశ్వర్లు సి.ఐ సీసీఎస్ భూపాలపల్లి,ఎం.సంజయ్ సి.ఐ ఆర్.పి.ఎఫ్ కాజిపేట్ రెండవ స్థానంలో ప్రణీత్ , శ్రవణ్ లు మూడవ స్థానం లో రెహన్ , నిఖిల్ గెలుపొందారు.విజేతలకు ట్రోఫీ తో పాటు నగదు బహుమతి ని స్టే ఫిట్ నిర్వాహకులు ప్రధానం చేశారు.అనంతరం పికిల్ బాల్ టోర్నమెంట్ స్టేట్ ప్రసిడెంట్ కె.వి జూన్సన్ మాట్లాడుతూ పాచ్చత్యా దేశాలలో ప్రచుర్యం పొందిన ఆటను మొట్టమొదట మన వరంగల్ క్రీడాకారులకు పరిచయం చేసి వారి క్రీడా నైపుణ్యం పెంపు తో పాటు క్రమశిక్షణ, ఫిటినెస్ ,మానసికొల్లాసం కోసం అలాగే పిల్లలు చెడు అలవాట్లకు, mobile ఆటకు దూరం చేయుటకు కు ఈ క్రీడలు ఎంతగానో తొడ్పతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి స్టే ఫిట్ యాజమాన్యం ప్రణీత్, సృజన్ , ప్రదీప్, పవన్ తో పాటు డా. డేవిడ్, విజయ్ ,రమేష్ , సతీష్ , రిషి క్రీడా అభిమానులు పాల్గొన్నారు.
