ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా దాసరి శ్రీను నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన శ్రీనును ఈ మేరకు నియమిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చిన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా శ్రీను దళిత ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్యలపై పోరాడడంలో ముందుంటున్నారు. తనను మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన నాయకులు చిన్నయ్య, వెంకటేశ్వర్లుకు శ్రీను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.